TMC | టీఎంసీ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్.. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ
TMC | పశ్చిమ బెంగాల్ (West Bengal) లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీకి చెందిన మూడు బ్యాంకు ఖాతాల (Bank Accounts) ను అధికారులు స్తంభింపజేశారు. సుమారు రూ.440 కోట్ల నిధులున్న ఈ ఖాతాలపై వేటుపడటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. పార్టీలో కొంతకాలంగా కొనసాగుతున్న అంతర్గత విభేదాల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
TMC : పశ్చిమ బెంగాల్ (West Bengal) లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీకి చెందిన మూడు బ్యాంకు ఖాతాల (Bank Accounts) ను అధికారులు స్తంభింపజేశారు. సుమారు రూ.440 కోట్ల నిధులున్న ఈ ఖాతాలపై వేటుపడటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. పార్టీలో కొంతకాలంగా కొనసాగుతున్న అంతర్గత విభేదాల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. తిరుగుబాటు నేత రిత్నబ్రత బెనర్జీ (Ritnabrata Banerjee) వర్గానికి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు బిధానగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ (Cyber Crime PS) లో ఫిర్యాదు చేయడంతో ఈ చర్యలు ప్రారంభమయ్యాయి.
పార్టీ ఖాతాల్లో జమ అయిన నిధులపై సమగ్ర విచారణ జరపాలని, అందులో ‘కట్ మనీ’, బలవంతపు వసూళ్లు, ప్రజాధనం దుర్వినియోగం వంటి అక్రమాలు ఉన్నాయని వారు ఆరోపించారు. ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న పోలీసులు.. కోల్‌కతాలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సెంట్రల్ ప్లాజా బ్రాంచ్‌లో ఉన్న పార్టీ ఖాతాల నుంచి నగదు ఉపసంహరణ నిలిపివేయాలని బ్యాంకు అధికారులను ఆదేశించారు. ఇటీవలి ఎన్నికల అనంతరం టీఎంసీలో విభేదాలు పొడచూపాయి. ఈ క్రమంలోనే పార్టీ మాజీ కోశాధికారి అరూప్ బిస్వాస్ జూన్ 12న బ్యాంకు యాజమాన్యానికి లేఖ రాస్తూ.. పార్టీలో అంతర్గత వివాదాలు ఉన్నందున లావాదేవీలను నిలిపివేయాలని అభ్యర్థించారు.
అయితే తిరుగుబాటు ఎమ్మెల్యేల ఫిర్యాదుతో ఈ వ్యవహారంలోకి పోలీసులు ప్రవేశించి కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ పరిణామాలను టీఎంసీ అధికారిక వర్గాలు తీవ్రంగా ఖండిస్తూ.. ఇదంతా రాజకీయ ప్రేరేపితమని ఆరోపిస్తున్నాయి. తమ పార్టీ ఆర్థిక లావాదేవీలన్నీ పారదర్శకంగానే ఉన్నాయని, ఈ వ్యవహారాన్ని చట్టపరంగా ఎదుర్కొంటామని స్పష్టంచేశాయి. మరోవైపు అరూప్ బిస్వాస్‌కు పార్టీ ఇప్పటికే షోకాజ్ నోటీసు జారీచేసింది. అయితే పార్టీ నిధులపై పూర్తిస్థాయి దర్యాప్తు జరగాల్సిందేనని తిరుగుబాటు వర్గం పట్టుబడుతోంది. ఈ తాజా ఘటనతో పార్టీ ఆస్తులు, ఉనికి కోసం సాగుతున్న ఆధిపత్య పోరు మరింత ముదిరినట్లయింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

