కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మరో జలక్ తగిలింది. సీనియర్ నేత మదన్ మిత్రా(Madan Mitra) ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఇవాళ ఆయన రిపోర్టర్లతో మాట్లాడారు. తృణమూల్ పార్టీ ఇప్పుడు ముక్కలైందన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగనాస్ జిల్లాలో ఉన్న కామర్‌హాతి సీటు నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. నేను టీఎంసీలో ఉన్నానని, టీఎంసీలోనే కొనసాగుతానని, కానీ అసెంబ్లీలో మాత్రం తన రూమ్‌ను మార్చుకున్నట్లు ఆయన చెప్పారు. ఇటీవల మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ పార్టీని అనేక మంది నేతలు వీడిన విషయం తెలిసిందే. దీదీకి చెందిన పార్టీ నుంచి తప్పుకున్న మదన్ మిత్రా.. రెబల్స్ దళంలో చేరినట్లు తెలుస్తోంది.