Kalyan Banerjee : ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో వక్ఫ్ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరగడంతో ఆగ్రహించిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ (Kalyan Banerjee) గాజు సీసాను పగలగొట్టారు. దాంతో ఆయన చేతికి గాయమైంది. వక్ఫ్ (సవరణ) బిల్లు, 2024పై మంగళవారం జరిగిన సమావేశంలో తృణమూల్ కాంగ్రెస్ సహా ప్రతిపక్ష నేతలు, అధికార బీజేపీ నేతలు పాల్గొన్నారు.
బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ అధ్యక్షతన ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ రిటైర్డ్ న్యాయమూర్తులు, న్యాయవాదుల బృందం.. ప్రతిపక్షాల అభిప్రాయాలను వింటుండగా విపక్ష ఎంపీలు, అధికార బీజేపీ ఎంపీలు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. కల్యాణ్ బెనర్జీకి భాజపా ఎంపీ అభిజిత్ గంగోపాధ్యాయకు మధ్య వాగ్వాదం నెలకొంది. దాంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన కల్యాణ్ బెనర్జీ పక్కనే ఉన్న గాజు వాటర్ బాటిల్‌ను పగలగొట్టారు. దాంతో అతడి చేతికి గాయమైంది.
గాజు ముక్క తెగి చేతి నుంచి రక్తం కారుతుండటంతో ఆయనకు ప్రథమ చికిత్స చేసి, ఆసుపత్రికి తీసుకెళ్లారు. బెనర్జీ ఈ విధంగా ప్రవర్తించినందుకు అతడిని పార్లమెంటరీ కమిటీ నుంచి సస్పెండ్ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
#WATCH | Delhi: TMC MP Kalyan Banerjee leaves from the meeting of the JPC (Joint Parliamentary Committee) on the Waqf Bill. pic.twitter.com/VdKErrBCcG
— ANI (@ANI) October 22, 2024