బెంగాల్ స్పీకర్‌గా బిమన్ బెనర్జి.. వరుసగా మూడోసారి ఎంపిక..!
Biman Banerjee: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ స్పీకర్‌గా మరోసారి బిమన్ బెనర్జి ఎన్నికయ్యారు. బెంగాల్ అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జి

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ స్పీకర్‌గా మరోసారి బిమన్ బెనర్జి ఎన్నికయ్యారు. బెంగాల్ అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జి సమక్షంలో ఎమ్మెల్యేలంతా కలిసి ఆయనను స్పీకర్‌గా ఎన్నుకున్నారు. బెహాలా వెస్ట్ ఎమ్మెల్యే పార్థ చటర్జి స్పీకర్‌గా బిమన్ బెనర్జి పేరును ప్రతిపాదించగా.. ఆ ప్రతిపాదన డమ్‌డమ్ నార్త్ ఎమ్మెల్యే చంద్రమా భట్టాచార్య బలపర్చారు. ఈ ప్రతిపాదన ఆధారంగా ప్రొటెం స్పీకర్ సుబ్రతా ముఖర్జి వాయిస్ ఓటింగ్ నిర్వహించి బిమన్ బెనర్జి స్పీకర్‌గా ఎన్నికైనట్లు ప్రకటించారు.
కాగా, బిమన్ బెనర్జి పశ్చిమబెంగాల్ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నిక కావడం వరుసగా ఇది మూడోసారి. 2011లో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన అసెంబ్లీ స్పీకర్‌గా కొనసాగుతున్నారు. టీఎంసీ వరుసగా మూడుసార్లు అధికారంలోకి రాగా.. ఆ మూడుసార్లూ స్పీకర్‌గా బిమన్ బెనర్జినే ఎన్నుకున్నారు. కాగా, నూతన స్పీకర్ బిమన్ బెనర్జికి ముఖ్యమంత్రి మమతాబెనర్జి, తోటి ఎమ్మెల్యేలు అంతా శుభాకాంక్షలు తెలిపారు. ఇక బిమన్ బెనర్జి సైతం ముఖ్యమంత్రి మమతాబెనర్జి, తోటి ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

