న్యూఢిల్లీ: నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులతో ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) ప్రత్యేకంగా మీటింగ్ నిర్వహించారు. దేశంలో వామపక్ష తీవ్రవాదం చివరి దశలో ఉన్నట్లు ఆయన చెప్పారు. 2026 మార్చి నాటికి దేశం ఆ సమస్య నుంచి విముక్తి కానున్నట్లు ఆయన వెల్లడించారు. 8 రాష్ట్రాల ప్రతినిధులతో జరిగిన రివ్యూ మీటింగ్‌లో అమిత్ షా మాట్లాడుతూ.. గడిచిన 30 ఏళ్లలో తొలిసారి ఇండియాలో వామపక్ష తీవ్రవాద హింస వల్ల మరణించిన వారి సంఖ్య 100 కన్నా తక్కువకు పడిపోయిందన్నారు. ఇది పెద్ద అచీవ్మెంట్ అని పేర్కొన్నారు.
గడిచిన పదేళ్లలో సుమారు 13000 మంది లెఫ్ట్‌వింగ్ తీవ్రవాదులు తమ ఆయుధాలను సరెండర్ చేసి, జనజీవన స్ర్రవంతిలో కలిసినట్లు వెల్లడించారు. ఇంకా మావో యుద్ధం చేస్తున్న యువత తమ వద్ద ఉన్న ఆయుధాలను సరెండర్ చేయాలని షా అప్పీల్ చేశారు. కేంద్రం అందిస్తున్న పునరావాస పథకాల ద్వారా లబ్ధిపొందాలని ఆయన కోరారు. నక్సల్స్ హిం ఎన్నటికీ, ఎప్పటికీ ఎవరికీ సాయం చేయదన్నారు.
ప్రస్తుతం 80 శాతం నక్సల్స్ కేడర్ చత్తీస్‌ఘడ్‌లో మాత్రమే ఉన్నదని, వామపక్ష తీవ్రవాదంపై తుది సమరం చేపట్టే దశ ఆసన్నమైనట్లు ఆయన వెల్లడించారు.
मोदी सरकार द्वारा बेहतर केंद्र-राज्य समन्वय से नक्सलवाद को देश से पूरी तरह से समाप्त किया जा रहा है। नई दिल्ली में वामपंथी उग्रवाद से प्रभावित प्रदेशों के मुख्यमंत्रियों, उपमुख्यमंत्रियों व वरिष्ठ अधिकारियों के साथ समीक्षा बैठक से लाइव…
https://t.co/2PDcqY3cVf— Amit Shah (@AmitShah) October 7, 2024