Tej Pratap Yadav | పాట్నా: బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు, ఆర్జేడీ నాయకుడు తేజ్ ప్రతాప్ సింగ్ యాదవ్ శుక్రవారం హోలీ వేడుకలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పార్టీ మద్దతుదారులతో కలిసి ఆయన హోలీ జరుపుకుంటున్నప్పుడు అక్కడే ఉన్న ఓ పోలీస్ కానిస్టేబుల్‌ను ఒక పాటకు నృత్యం చేయాలని, అందుకు నిరాకరిస్తే సస్పెండ్ అవుతావని బెదిరించారు.
తన ఆదేశాలకు ఏమీ అనుకోవద్దని.. ఇది హోలీ పండగని ఆయన కానిస్టేబుల్‌తో అన్నారు. తేజ్ మాటలతో ప్రభావితమైన ఆ కానిస్టేబుల్ కాసేపు ఆర్జేడీ కార్యకర్తలతో కలిసి నృత్యం చేశారు. ఈ ఘటనపై బీజేపీ, జేడీయూ స్పందిస్తూ.. అధికారం లేకున్నా లాలూ కుటుంబం తీరు మారలేదన్నారు.