న్యూఢిల్లీ, డిసెంబర్ 7: మహారాష్ట్ర (Maharashtra) బొరాటే ప్రాంతానికి చెందిన మూడు అడుగుల బర్రె (పేరు రాధ) గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో (Guinness World Record) చోటుదక్కించుకుంది. ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఎత్తు కలిగిన బర్రెగా ‘రాధ’కు గిన్నిస్‌లో చోటుదక్కింది. సాధారణంగా బర్రెలు 5 నుంచి 6 అడుగుల ఎత్తు వరకు ఉంటాయి. అయితే ‘రాధ’ ఎత్తు కేవలం 85 సెంటీమీటర్లు ఉండటం.. అందరి దృష్టిని ఆకర్షించింది. అంతర్జాతీయంగా పలు ప్రదర్శనలకు ‘రాధ’ చీఫ్ గెస్ట్‌గా హాజరవుతున్నది. థాయిలాండ్‌కు చెందిన ‘కింగ్ కాంగ్’ 6 అడుగుల ఎత్తుతో ప్రపంచంలో అత్యంత ఎత్తయిన బర్రెగా నిలిచింది. దీంతో పోల్చితే ‘రాధ’ దాదాపు 3 అడుగులు చిన్నది.