సాగర్: మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో ఓ బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులకు భారీగా బంగారం, నగదుతో పాటు మూడు మొసళ్లు కనిపించడం షాక్ కలిగించింది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే హర్వంశ్ సింగ్ రాథోడ్ బీడీల వ్యాపారంలో చట్ట విరుద్ధ లావాదేవీలకు పాల్పడ్డారని ఫిర్యాదు రావడంతో ఈ నెల 5 నుంచి ఐటీ అధికారులు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. రాథోడ్ రూ.140 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడినట్టు గుర్తించారు. రాథోడ్ వ్యాపార భాగస్వామి రాజేశ్ నివాసంలోనూ సోదాలు జరిగాయి.