జైపూర్: వేల సంఖ్యలో ఆవులు మరణించాయి. ఆవుల కళేబరాలు ఒక ప్రాంతంలో గుట్టలుగా పడి ఉన్నాయి. లంపి వైరస్ వల్ల వేలాది ఆవులు చనిపోయినట్లు వార్తలు, ఫొటోలు వైరల్ అయ్యాయి. అయితే అధికారులు వాటిని ఖండించారు. రాజస్థాన్లోని బికనీర్లో లంపి వైరస్ విజృంభిస్తున్నది. దీని బారిన పడిన పశువులు రోజుకు 250కుపైగా మరణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చనిపోయిన ఆవుల కళేబరాలను ఒక ప్రాంతంలో గుట్టలుగా పడేసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కాగా, ఈ వార్తలు, ఫొటోలపై బికనీర్ జిల్లా కలెక్టర్ భగవతి ప్రసాద్ కలాల్ స్పందించారు. అవి తప్పుడు వార్తలు, అవాస్తవమని అన్నారు. వైరల్ అయిన ఫొటోలలో ఉన్న ప్రాంతం చనిపోయిన జంతువుల కోసం కేటాయించిన జోన్ అని తెలిపారు. బికనీర్ నగర పరిధిలో మరణించిన పశువులను ఇక్కడకు తరలిస్తారని చెప్పారు. చర్మాన్ని తొలగించి కళేబరాలను ఎండబెడతారని, ఎముకలను కాంట్రాక్టర్ సేకరించి అమ్ముతాడని వెల్లడించారు. ఇక్కడ ప్రతి రోజు వెయ్యికిపైగా చనిపోయిన జంతువుల కళేబరాలు కనిపిస్తాయని వివరించారు.
మరోవైపు ఈ జోన్ రాబందుల రక్షిత ప్రాంతమని బికనీర్ జిల్లా కలెక్టర్ భగవతి ప్రసాద్ కలాల్ తెలిపారు. లంపి వైరస్ వల్ల చనిపోయిన పశువుల కళేబరాలను ఇక్కడకు తరలించరని చెప్పారు. వ్యాధులతో మరణించిన పశువుల కోసం పలు ప్రాంతాలను కేటాయించామని, అక్కడ వాటి కళేబరాలను భూమిలో పూడుస్తారని వెల్లడించారు.
అయితే ప్రభుత్వ గణాంకాల ప్రకారం రాజస్థాన్ వ్యాప్తంగా లక్షకుపైగా పశువులు లంపి చర్మ వ్యాధికి ప్రభావితమయ్యాయి. ఒక్క బికనీర్లోనే 2,573 పశువులు ఈ వైరల్ వల్ల చనిపోయాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్ నుంచి పశువుల కొనుగోలును పలు రాష్ట్రాలు నిషేధించాయి.
दैनिक भास्कर में आज छपी खबर भ्रामक है। इसमें महत्वपूर्ण तथ्य छिपाए गए हैं
जोड़बीड़ का यह क्षेत्र पिछले 50 वर्षों से गिद्ध संरक्षण क्षेत्र है।
नगर निगम द्वारा वर्षों से यहां मृत पशुओं को डालने का ठेका दिया जाता है।
लंपी स्किन रोग से मृत पशुओं का निस्तारण नियमानुसार किया जा रहा है। pic.twitter.com/78dfqgVGSB— District Collector & Magistrate – Bikaner (@BikanerDm) September 7, 2022