న్యూఢిల్లీ: ఈ యేటి సివిల్స్ పరీక్షలో శుభం కుమార్ టాపర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే అతను ఆ పరీక్షలో ఎన్ని మార్కులు సాధించాడో తెలుసా. అతనే కాదు, సివిల్స్ పరీక్షలో టాపర్లు ఎన్నెన్ని మార్కులు సాధించారో యూపీఎస్సీ ఆ రిపోర్ట్‌ను రిలీజ్ చేసింది. ఐఏఎస్ టాపర్ శుభమ్ కుమార్ మొత్తం 1054 (878+176) మార్క్‌లు సాధించాడు. ఇక రెండవ ర్యాంక్ సాధించిన జాగ్రతి అవాస్తి మొత్తం 1052 (859+193) మార్క్‌లు సాధించింది. మూడవ ర్యాంక్ సాధించిన అంకితా జైన్‌కు 1051 (839+212) మార్క్‌లు వచ్చాయి. యూపీఎస్సీ పరీక్షను మొత్తం 761 మంది అభ్యర్థులు క్లియర్ చేశారు. దాంట్లో 545 మంది పురుషులు, 216 మంది మహిళలు ఉన్నారు. ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూ రూపంలో మూడు దశల్లో యూపీఎస్సీ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే.
24 ఏళ్ల శుభం కుమార్‌ది బీహార్. ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్‌కు సెలెక్ట్ అయ్యాడు. 2019లో సివిల్స్ క్వాలిఫై అయ్యాడు. 2018లో తొలిసారి పరీక్ష రాసినా అర్హత సాధించలేదు. ఐఐటీ బాంబేలో అతను బీఈ సివిల్ ఇంజనీరింగ్ చేశాడు. 2020 యూపీఎస్సీలో ఆంత్రాపాలజీని ఆప్షనల్ సబ్జెక్ట్‌గా ఎంచుకున్నారు.