న్యూఢిల్లీ: అత్యవసర రైలు ప్రయాణాలు, లేదా అప్పటికప్పుడు టూర్లు ప్లాన్ చేసుకునేవారికి ఇది గుడ్న్యూస్. ఎందుకంటే వందేభారత్ సహా ఇతర రిజర్వేషన్ సీట్లు ఉండే రైళ్లు స్టేషన్ నుంచి కదలడానికి 15 నిమిషాల ముందు టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటు రైల్వేశాఖ కల్పించింది.
ఫైనల్ రిజర్వేషన్ చార్ట్ రిలీజ్ అయిన తర్వాత.. మీరు ఎంచుకున్న స్టేషన్ నుంచి రిజర్వేషన్ సీట్లలో ఏమైనా మిగిలితే వాటిని ట్రైన్ కదిలే 15 నిమిషాల ముందు బుక్ చేసుకోవచ్చు. ఐఆర్సీటీసీ, ది రైల్ కనెక్ట్ యాప్, పీఆర్సీ కౌంటర్ల ద్వారా ఈ టికెట్లు పొందొచ్చు.