Mallikharjuna Kharge: రాజ్యసభలో ఆ 12 మంది ఎంపీల సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధం
Mallikharjuna Kharge: రాజ్యసభలో 12 మంది ఎంపీల సస్పెన్షన్‌పై కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే మరోసారి విమర్శలు
కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే

న్యూఢిల్లీ: రాజ్యసభలో 12 మంది ఎంపీల సస్పెన్షన్‌పై కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే ( Mallikharjuna Kharge ) మరోసారి విమర్శలు చేశారు. సస్పెన్షన్‌కు నిరసనగా 12 మంది విపక్ష ఎంపీలు గాంధీ విగ్రహం దగ్గర ధర్నా చేస్తున్నారన్నారు. రాజ్యసభ ఛైర్మన్ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, వర్షాకాల సమావేశాల్లో సభా నియమాల ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ సభ్యులపై శీతాకాల సమావేశాల్లో సస్పెన్షన్ విధించడం కూడా సభా నియమాల ఉల్లంఘనే అవుతుందని వ్యాఖ్యానించారు.
ఆ 12 మంది ఎంపీల సస్పెన్షన్ సభా నిబంధనలకు మాత్రమే విరుద్ధం కాదని, రాజ్యాంగానికి కూడా విరుద్ధమేనని మల్లిఖార్జున ఖర్గే అన్నారు. రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంపీలపై సస్పెన్షన్‌ను ఎత్తివేసి వారు సభలో తమ అభిప్రాయాలను వెల్లడించే అవకాశం కల్పించాలని ఖర్గే సూచించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సద్దుల పొద్దు.. పూల సద్దు!
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

