ముంబై, మే 31 (నమస్తే తెలంగాణ) : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ భార్య కాంచన్ ధాపేవాడలో తమకు గల భక్తి ఫార్మ్‌లో దాదాపు కిలో బరువు ఉండే ఉల్లి గడ్డలను పండిస్తున్నారు.
ఇందుకోసం నెదర్లాండ్స్ నుంచి విత్తనాలు తెప్పించి సహజసిద్ధ, సేంద్రియ ఎరువులను ఉపయోగించి డబుల్ డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో పండిస్తున్నారు. ఎకరా భూమిలో 12-13 టన్నుల ఉల్లిపాయల దిగుబడి వచ్చిందని నితిన్ గడ్కరీ వివరించారు.పంట కాలంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు.