న్యూఢిల్లీ : అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ (యూపీఎఫ్ఎస్)ను అధికంగా తీసుకోవడం వల్ల లంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నదని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది. ఆరోగ్యం, అలవాట్లకు సంబంధించి లక్ష మందికిపైగా పెద్దలపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.
అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకునే అలవాట్లను బట్టి వారిని నాలుగు గ్రూపులుగా విభజించారు. వీరిలో యూపీఎఫ్ పదార్థాలను తక్కువ మోతాదులో తీసుకునే వారిలో పోలిస్తే అధికం మొత్తంలో తీసుకునే వారిలో లంగ్ క్యాన్సర్ వచ్చే ముప్పు 41 శాతం ఎక్కువగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయన వివరాలు ‘థోరాక్స్’ జర్నల్లో ప్రచురితమయ్యాయి.