మళ్లీ కేరళ క్యాబినెట్లోకి సాజి చెరియన్.. మంత్రిగా ప్రమాణస్వీకారం
Saji Cherian | కేరళకు చెందిన సీపీఐ (ఎం) నేత, ఎమ్మెల్యే సాజి చెరియన్‌కు మళ్లీ మంత్రి యోగం పట్టింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆయనను మళ్లీ క్యాబినెట్లోకి
తిరువనంతపురం: కేరళకు చెందిన సీపీఐ (ఎం) నేత, ఎమ్మెల్యే సాజి చెరియన్‌కు మళ్లీ మంత్రి యోగం పట్టింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆయనను మళ్లీ క్యాబినెట్లోకి తీసుకున్నారు. గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ అభ్యంతరం చెప్పినా సీఎం పినరయి విజయన్ పట్టుబట్టి సాజి చెరియన్ను మంత్రివర్గంలో చేర్చుకున్నారు.
సాజి చెరియన్ క్యాబినెట్లోకి తీసుకోనున్నట్లు సీఎం పినరయి విజయన్ గత నెల 30న గవర్నర్‌కు ప్రతిపాదన పంపారు. అయితే, ఆ ప్రతిపాదనకు గవర్నర్ అభ్యంతరం తెలిపారు. అయినా, సాజీ చెరియన్ను మంత్రివర్గంలోకి తీసుకునేందుకే విజయన్ పట్టుబట్టడంతో గవర్నర్ ఆమోదం తెలిపారు. దాంతో ఇవాళ సాజీ చెరియన్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ అతని చేత ప్రమాణస్వీకారం చేయించారు.
రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్న సాజి చెరియన్ గత జూన్‌లో రాజ్యాంగంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో గత జూలైలో సాజి చెరియన్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే, ఇప్పుడు సీఎం పినరయి విజయన్ పట్టుబట్టి మరీ ఆయనను మంత్రివర్గంలోకి తీసుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

