న్యూఢిల్లీ: ఒక కోతి దాహంతో అల్లాడిపోయింది. (Thirsty Monkey) స్కూల్ విద్యార్థి బ్యాగ్ నుంచి వాటర్ బాటిల్ తీసుకునేందుకు అది ప్రయత్నించింది. ఆ బాలుడి తల్లి దీనిని గమనించి వెంటనే స్పందించింది. ఆ వాటర్ బాటిల్ మూత తెరిచి కోతి దాహాన్ని ఆమె తీర్చింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కొందరు స్కూల్ విద్యార్థులు ఒక బస్టాంప్ వద్ద ఉన్నారు. ఇంతలో బాగా దాహంతో ఉన్న ఒక కోతి అక్కడకు వచ్చింది. ఒక విద్యార్థి స్కూల్ బ్యాగ్‌లో ఉన్న వాటర్ బాటిల్ తీసుకునేందుకు ప్రయత్నించింది.
కాగా, తన కుమారుడు స్కూల్ బ్యాగ్ పైకి కోతి దూకడాన్ని అతడి తల్లి చూసింది. కొడుకు భద్రతతోపాటు ఆ కోతి అవసరాన్ని ఆమె గ్రహించింది. వెంటనే కుమారుడి స్కూల్ బ్యాగ్ నుంచి వాటర్ బాటిల్‌ను ఆమె తీసింది. దాని మూత తెరిచింది. దాహంతో అల్లాడిపోయిన ఆ కోతికి నీటిని తాగించింది. దాహం తీరిన ఆ కోతి అక్కడి నుంచి దూరంగా వెళ్లింది.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు స్పందించారు. కోతి దాహం తీర్చిన విద్యార్థి తల్లిని మెచ్చుకున్నారు. ఎంతైనా తల్లి తల్లేనని కొందరు కొనియాడారు. ఎవరి అవసరాలు ఏమిటో అన్నది మాతృమూర్తులు గ్రహించి వాటిని తీరుస్తారని మరికొందరు ప్రశంసించారు.
Respect for the mother 🥹❤️ pic.twitter.com/O2TccmuA1i
— Harsh (@harshch20442964) January 26, 2025