Delhi Heist: ఢిల్లీ జ్వలరీ షాపులో భారీ చోరీ.. 25 కోట్ల విలువైన ఆభరణాలు మాయం
Delhi Heist: జ్వలరీ షాపులో ప్రవేశించిన దొంగలు ముందుగా సీసీటీవీలను నిర్వీర్యం చేశారు. ఆ తర్వాత ఆ షాపులో ఉన్న స్ట్రాంగ్‌రూమ్ గోడకు రంధ్రం చేశారు. ఇక ఆ రూమ్‌లో ఉన్న లాకర్ల నుంచి సుమారు 25 కోట్ల విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లారు.
న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని జాంగ్‌పుర ప్రాంతంలో ఉన్న ఉమ్రావో జ్వలరీ షాపులో ఆదివారం రాత్రి దొంగలు పడ్డారు(Delhi Heist). ఆ జ్వలరీ షాపులో ఉన్న సుమారు 25 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. చోరీ చేయడానికి ముందు దొంగలు సీసీటీవీ కెమెరాలను డిస్కనెక్ట్ చేశారు. లాకర్లు ఉన్న స్ట్రాంగ్‌రూమ్‌కు రంధ్రం చేసి దొంగలు చోరీకి పాల్పడ్డారు.
నాలుగు అంతస్తులు ఉన్న ఆ బిల్డింగ్‌లోకి పై అంతస్తు నుంచి దొంగలు ప్రవేశించారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న స్ట్రాంగ్‌రూమ్‌ను పగలగొట్టారు. స్ట్రాంగ్‌రూమ్‌లోకి ప్రవేశించేందుకు గోడకు భారీ రంధ్రాన్ని డ్రిల్ చేశారు. అక్కడ ఉన్న ఆభరణాలతో పాటు షోరూమ్‌లో డిస్ప్లేలో ఉన్న బంగారన్ని కూడా ఎత్తుకెళ్లారు. ఆదివారం సాయంత్రం షోరూమ్ ఓనర్ షాపును మూసివేశాడు.
సోమవారం ఆ షోరూమ్‌కు సెలవుదినం. ఇవాళ ఉదయం షాపు తెరవగానే దొంగలుపడినట్లు తేలిపోయింది. ఈ కేసులో ఇప్పటి వరకు ఎవర్నీ అరెస్టు చేయలేదు. రెండు రోజుల క్రితం హర్యానాలోని అంబాలాలో కూడా దొంగలు పడ్డారు. కోఆపరేటివ్ బ్యాంకు నుంచి జ్వలరీతో పాటు ఇతర విలువైన వస్తువుల్ని ఎత్తుకెళ్లారు. గోడకు రంధ్రాన్ని డ్రిల్ చేసి, 32 లాకర్లను ఓపెన్ చేశారు.
జ్వలరీ షాపు చోరీ పెద్ద ఘటన అని, ప్రస్తుతం విచారణ జరుగుతున్నదని, సీసీటీవీ ఫూటేజీని పరిశిలీస్తున్నట్లు డీసీపీ రాజేశ్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

