డెహ్రాడూన్: కొందరు దొంగలు గ్యాస్ కట్టర్‌తో ఏటీఎం తెరిచారు. (Thieves break into ATM) అందులోని లక్షలాది డబ్బును చోరీ చేశారు. తమను గుర్తించకుండా ఉండేందుకు శాలువాలు కప్పుకున్నారు. పరుగున ఏటీఎం నుంచి వాహనం వద్దకు చేరుకున్నారు. డబ్బులున్న బ్యాగులను అందులో ఉంచి అక్కడి నుంచి పారిపోయారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో ఈ సంఘటన జరిగింది. శనివారం అర్ధరాత్రి తర్వాత ధండేరా ప్రాంతంలోని ఎస్బీఐ ఏటీఎం వద్దకు నలుగురు వ్యక్తులు వచ్చారు. గ్యాస్ కట్టర్‌తో ఏటీఎం తెరిచారు. దీంతో కొన్ని నోట్ల కట్టలు కాలిపోయాయి. లక్షల్లో ఉన్న మిగతా డబ్బును కొన్ని బ్యాగుల్లో సర్దుకున్నారు. గుర్తించకుండా ఉండేందుకు శాలువాలు కప్పుకుని ఆగి ఉన్న స్కార్పియో కారు వద్దకు పరుగులు తీశారు. ఈ సందర్భంగా ఒక వ్యక్తి చుట్టుకున్న శాలువా జారిపోయింది. అనంతరం డిక్కీలో డబ్బుల బ్యాగులు ఉంచారు. ఆ వాహనంలో అక్కడి నుంచి పారిపోయారు.
కాగా, ఈ విషయం తెలిసిన పోలీసులు ఆ ఏటీఎం వద్దకు చేరుకున్నారు. చోరీ జరిగిన తీరును పరిశీలించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
रुड़की के लकसर मार्ग, ढंढेरा में देर रात एटीएम में लाखों की लूट, सीसीटीवी में कैद हुई घटना#roorkee #Uttarakhand pic.twitter.com/329yzdOorZ
— Khabar Uttarakhand (@KUttarakhand) December 16, 2023