చండీగఢ్ : హర్యానాలోని రెవారి జిల్లాలో ఓ దొంగ ఆలయంలో చోరీకి (Theft In Temple) తెగబడ్డాడు. హనుమాన్ ఆలయంలో ప్రవేశించిన దొంగ హనుమాన్ చాలీసా పఠించి ఆపై పది రూపాయలు హుండీలో వేశాడు. ఇక హుండీని పగులగొట్టి రూ. 5000 చోరీ చేసి ఉడాయించాడు. దరుహెరా పట్టణంలో జరిగిన ఈ చోరీ ఘటన మొత్తం అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.
ఈ వీడియోలో తొలుత హనుమాన్ ఆలయంలోకి వచ్చిన వ్యక్తి పదినిమిషాల పాటు భక్తులతో కలిసి హనుమాన్ చాలీసా చదివాడు. పూజారి సమక్షంలో విగ్రహం ముందు అతడు రూ. పది సమర్పించాడు. ఇక గర్భగుడిలో ఎవరూ లేని సమయం చూసి హుండీని పగులగొట్టి అందులో ఉన్న రూ. 5000తో పరారయ్యాడు.
చోరీ జరిగిందనే విషయం తెలియని పూజారి రాత్రి ఆలయ తలుపులు మూసివేసి ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం ఆలయంలోకి వచ్చిన పూజారి హుండీ పగులగొట్టినట్టు చూసి కంగుతిన్నాడు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా ఈ షాకింగ్ వివరాలు వెలుగుచూశాయి. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Read More :