త్వరలో పిల్లల కోసం రానున్న కరోనా వ్యాక్సిన్లు ఇవే

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి పిల్లలపై అంతగా ప్రభావం చూపదని తొలి దశ వచ్చినప్పుడు అనుకున్నారు. కానీ రెండో దశ అది తప్పని నిరూపించింది. లక్షల మంది చిన్నారులు కరోనా బారిన పడ్డారు. మూడో దశ అయితే కేవలం పిల్లలే లక్ష్యంగా విరుచుకుపడొచ్చన్న ఆందోళనలూ ఉన్నాయి. పెద్దలలాగే చిన్నారులు ఈ కరోనా నుంచి గట్టెక్కాలన్నా వ్యాక్సిన్లే మార్గం. ఇప్పటికే 12 నుంచి 15 ఏళ్ల మధ్య వయసు పిల్లలకు అమెరికా, కెనడా, యురోపియన్ యూనియన్లు వ్యాక్సిన్లు వేశాయి. యునైటెడ్ కింగ్డమ్ కూడా ఫైజర్ వ్యాక్సిన్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
అటు మోడెర్నా వ్యాక్సిన్‌ను కూడా పిల్లలకు ఇవ్వడానికి అమెరికా అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ఆస్ట్రాజెనెకా కూడా ఆరు నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలపై ప్రయోగాలు చేస్తోంది. చిన్నారులపైనా కరోనా తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఈ వ్యాక్సిన్లు ఇండియాలోనూ అందుబాటులోకి రావాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏయే వ్యాక్సిన్లు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయో ఒకసారి చూద్దాం.
కొవాగ్జిన్.. తొలి దశ ప్రయోగాలు
ఇండియాలో అభివృద్ధి చేసిన తొలి కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఇప్పుడు పిల్లలకూ ఈ వ్యాక్సిన్ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా 2 -18 ఏళ్ల వయసు వారిపై ట్రయల్స్ నిర్వహిస్తోంది. కొవాగ్జిన్ పిల్లలపైనా బాగా పని చేస్తున్నట్లు ప్రభుత్వ టాస్క్‌ఫోర్స్ చీఫ్ వీకే పాల్ అన్నారు.
జైడస్ క్యాడిలా.. ఒకేసారి ఇద్దరికీ
అహ్మదాబాద్‌కు చెందిన ఫార్మా సంస్థ జైడస్ క్యాడిలా త్వరలో కరోనా వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి తీసుకురాబోతోంది. 18 ఏళ్లు నిండిన వాళ్లతోపాటు పనిలో పనిగా 12 నుంచి 18 ఏళ్ల వారిపైనా ప్రయోగాలు నిర్వహిస్తోంది. వచ్చే రెండు వారాల్లో అత్యవసర వినియోగానికి అనుమతి కోసం దరఖాస్తు చేయనుంది.
ఫైజర్.. ఇప్పటికే రెడీ
వ్యాక్సిన్ వల్ల కలిగే దుష్ప్రభావాలకు నష్ట పరిహారం డిమాండ్ చేయకుండా ప్రభుత్వం చట్టపరమైన రక్షణ కల్పిస్తే చాలు దేశంలో అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంది ఫైజర్. ఇది పిల్లలకూ ప్రయోజనం చేకూర్చనుంది. ఇప్పటికే ఫైజర్ వ్యాక్సిన్‌ను అమెరికాలో పిల్లలకు ఇస్తుండగా.. యూకే కూడా దీనికి అనుమతి ఇచ్చింది. దీంతో ఇండియా గ్రీన్‌సిగ్నల్ ఇస్తే ఒకేసారి పిల్లలకు, పెద్దలకు ఇది అందుబాటులోకి వస్తుంది.
స్పుత్నిక్ వి.. త్వరలోనే ప్రయోగాలు
ఇప్పటికే ఇండియాలో అనుమతి పొందిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ఈ నెలాఖరులోగా పెద్దలకు అందుబాటులోకి రానుంది. అటు రానున్న వారాల్లో పిల్లలపైనా ప్రయోగాలకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా పిల్లల వయసు, బరువును బట్టి డోసుల్లో మార్పులు చేసి ఇస్తామని ఆ సంస్థ చెప్పింది. దీనికోసం రష్యా ఆరోగ్య శాఖ అనుమతి కోసం ఎదురుచూస్తోంది.
మోడెర్నా.. అమెరికా అనుమతి కోసం..
అమెరికాకు చెందిన మోడెర్నా కూడా 12 నుంచి 17 ఏళ్ల మధ్య వయసు పిల్లలపై ప్రయోగాలు నిర్వహించింది. ఈ వ్యాక్సిన్ వాళ్లపై సమర్థంగా పనిచేస్తున్నట్లు తేలింది. అమెరికా ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తోంది. అదే జరిగే ఫైజర్ తర్వాత పిల్లలకు అందుబాటులోకి రానున్న రెండో వ్యాక్సిన్ ఇదే అవుతుంది. అయితే పిల్లల కోసం ఈ వ్యాక్సిన్‌ను ఇండియాకు తీసుకురావడంపై ఇప్పటి వరకూ చర్చలు జరగలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | రాష్ట్రంలో ఇన్ని హాలిడేలు ఎందుకు.. రేవంత్ రెడ్డికి హాలిడే చెబితే లొల్లిపోదా.. కేటీఆర్ సెటైర్లు
KTR | నల్లమల పిల్లికి ఎలుకలు పట్టడం కూడా చేతనైతలేదా.. రిమ్స్ ఘటనపై కేటీఆర్ ఎద్దేవా
KTR | తెలంగాణకు ప్రధాని మోదీ ఏం ఇచ్చారు.. బీజేపీకి ఎందుకు ఓటేయాలి.. బడే బాయ్ – చోటే బాయ్ బంధంపై కేటీఆర్ ఫైర్
Back Pain | వెన్ను నొప్పికి అసలు కారణాలు ఏమిటి.. ఎలాంటి జాగ్రత్తలను పాటించాలి..
KTR | మూడు నెలల్లో పిల్లలు పుడతారా అన్న రేవంత్.. మరి మూడేళ్లయినా హామీలు ఎందుకు నెరవేర్చలేదు.. రైతు గర్జనలో నిలదీసిన కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

