న్యూఢిల్లీ, అక్టోబర్ 9: దేశంలో బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి (థర్మల్ పవర్) వరుసగా రెండో నెలా పడిపోయింది. తగ్గిన విద్యుత్తు వినియోగం, పెరిగిన సోలార్ విద్యుదుత్పత్తి కారణంగా సెప్టెంబర్లో థర్మల్ పవర్ ఉత్పాదకత తక్కువైందని గ్రిడ్ రెగ్యులేటర్ గణాంకాలు చెప్తున్నాయి.
దేశీయంగా బొగ్గు, లిగ్నైట్ ఆధారిత ప్లాంట్లలో విద్యుదుత్పత్తి నిరుడుతో పోల్చితే గత నెల 5.8 శాతం క్షీణించినట్టు తేలింది. అంతకుముందు నెల ఆగస్టులోనూ 4.9 శాతం పతనమైనట్టు ప్రభుత్వ రంగ గ్రిడ్ ఇండియా లెక్కలు చూపుతున్నాయి.