న్యూఢిల్లీ, మే 15: భారత్ సైన్యం దాడుల అనంతరం పాకిస్థాన్‌లోని ఏ అణుకేంద్రం నుంచి కూడా రేడియేషన్ లీక్ కాలేదని గ్లోబల్ న్యూక్లియర్ వాచ్‌డాగ్‌గా వ్యవహరించే అంతర్జాతీయ అణుశక్తి సంస్థ(ఐఏఈఏ) గురువారం వెల్లడించింది. భారత బలగాలు పాక్‌లోని అణు స్థావరాలపై దాడి చేశాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఐఏఈఏ స్పందించింది.
ఈ సంస్థ ప్రతినిధి మాట్లాడు తూ పాకిస్థాన్‌లో ఎలాంటి అణు రేడియేషన్ లీకులు లేవని తెలిపారు. అంతకుముందు భారత వైమానిక దళ డీజీఏవో, ఎయిర్ మార్షల్ ఏకే భారతి 12న నిర్వహించిన మీడియా సమావేశంలో కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించారు. పాకిస్థాన్ అణు నిల్వలు ఉన్న కిరానా హిల్స్‌పై దాడి వదంతులను ఖండించారు.