Arvind Kejriwal: బీజేపీ నేతలు తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణల కేసులో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు ఇవ్వడంపై.. ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రివాల్ స్పందించారు. క్రైమ్ బ్రాంచ్ నుంచి వచ్చిన పోలీస్ అధికారులు మా ఇంటి ముందు పెద్ద డ్రామా నడిపించారని, వాళ్లు పోలీస్ డిపార్టుమెంటులో చేరింది డ్రామాలు ఆడటానికి కాదని అన్నారు.
వాళ్ల రాజకీయ గురువులు ఢిల్లీ పోలీసులను జోక్‌గా మార్చారని కేజ్రీవాల్ విమర్శించారు. ఆప్ ఎమ్మెల్యేలను కొనడానికి ఎవరు సంప్రదింపులు జరిపారని వాళ్లు అడుగుతున్నారని, ఇది ఎవరికైనా తెలియని విషయమా..? అని ఆయన ప్రశ్నించారు. దేశంలో ప్రతీది కొనుగోలు చేసే పార్టీ ఒక్కటే ఉందని పరోక్షంగా బీజేపీని ఎద్దేవా చేశారు.