అంబులెన్స్ డ్రైవర్లకు నా కృతజ్ఞతలు: ప్రధాని మోదీ
PM on Ambulance drivers: దేశమంతా కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్న వేళ.. కరోనా బాధితులను, కరోనా బారినపడి మరణించిన వారి మృతదేహాలను తరలించడంలో అంబులెన్స్ డ్రైవర్ల కృషిని ఎప్పటికీ మరువలేమని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు.

న్యూఢిల్లీ: దేశమంతా కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్న వేళ.. కరోనా బాధితులను, కరోనా బారినపడి మరణించిన వారి మృతదేహాలను తరలించడంలో అంబులెన్స్ డ్రైవర్ల కృషిని ఎప్పటికీ మరువలేమని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం అలిండియా రేడియోలో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. కరోనాపై యుద్ధంలో అంబులెన్స్ డ్రైవర్లు బృహత్తరమైన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. వారి సేవలకు తాను మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని చెప్పారు.
ఈ సందర్భంగా ప్రేమ్ జీ అనే ఒక అంబులెన్స్ డ్రైవర్‌తో ప్రధాని మాట్లాడారు. ఒక అంబులెన్స్ డ్రైవర్‌గా అతని అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. మే 1 తర్వాత ఉచిత కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకోవాలని సూచించారు. కరోనా కట్టడికి సంబంధించి ఆలిండియా రేడియోలో దేశ ప్రజలకు సందేశం ఇవ్వమని ప్రధాని కోరారు. దాంతో డ్రైవర్ ప్రేమ్ జీ అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని, కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
దేశాన్ని మహమ్మారి ఉక్కిరిబిక్కిరి చేసింది: ప్రధాని మోదీ
రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో వర్షాలు : ఐఎండీ
కొవిడ్ హాస్పిటల్లో మంటలు.. 23 మంది రోగుల మృతి
సుప్రీం కోర్టు జడ్జి మోహన్ ఎం శాంతనగౌడర్ కన్నుమూత
రాష్ట్రంలో కొత్తగా 8 వేల కరోనా కేసులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

