న్యూఢిల్లీ: నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ)కి డీమ్డ్ యూనివర్సిటీ హోదాను కల్పిస్తూ కేంద్ర విద్యా శాఖ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఎన్సీఈఆర్టీ ఇకపై కోర్సులను/ప్రోగ్రామ్లను ఆఫర్ చేయనున్నది.
డిగ్రీలను ప్రదానం చేయనున్నది. ఎన్సీఈఆర్టీకి డీమ్డ్ వర్సిటీ హోదా కల్పించాలన్న నిపుణుల కమిటీ సిఫార్సు లను ఈ ఏడాది జనవరిలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆమోదించింది. తాజాగా ఎన్సీఈఆర్టీతోపాటు దానికి అనుబంధంగా మరో ఆరు ప్రాంతీయ సంస్థలకు డీమ్డ్ హోదాను కల్పించింది.