MIS | న్యూఢిల్లీ : మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ (ఎంఐఎస్) మార్గదర్శకాలను కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సోమవారం సవరించింది. వీటి సేకరణ పరిమితిని ప్రస్తుత 20 శాతం నుంచి 25 శాతానికి పెంచింది. ఈ పథకాన్ని అమలు చేసే విధంగా రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
టమాటా, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు వంటివాటికి కనీస మద్దతు ధర వర్తించదు. త్వరగా చెడిపోయే వ్యవసాయ/ఉద్యానవన పంటలకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ ఉత్పత్తులకు మార్కెట్ ధరలో కనీసం 10 శాతం తగ్గుదల కనిపించినపుడు మాత్రమే ఈ పథకం అమలవుతుంది. మార్కెట్ ఇంటర్వెన్షన్ ధరకు, అమ్మకపు ధరకుగల వ్యత్యాసాన్ని రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేస్తారు.