న్యూఢిల్లీ: కలకత్తా హైకోర్టులో ఇద్దరు న్యాయమూర్తుల మధ్య నెలకొన్న జగడంపై సుప్రీంకోర్టు శనివారం కీలక ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్లో వైద్య కళాశాలలు, హాస్పిటల్స్‌లో ఎంబీబీఎస్ ప్రవేశాల్లో అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణల కేసుకు సంబంధించి కలకత్తా హైకోర్టు రెండు బెంచ్‌ల ముందు అన్ని ప్రొసీడింగ్స్‌ను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది.
సుమోటోగా విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. కేసులో సింగిల్ బెంచ్ జడ్జి దర్యాప్తు ఆదేశాలపై మరో జడ్జి మధ్యంతర ఆదేశాలివ్వడంపై వివాదం రేగింది.