Mohan Babu | న్యూఢిల్లీ, జనవరి 9: జర్నలిస్ట్‌పై దాడి కేసులో నటుడు మోహన్‌బాబుకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరుచేసింది. ఆయనపై చర్యలూ తీసుకోరాదని తెలంగాణ పోలీసులను ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు తన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ మోహన్‌బాబు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సుధాంశు ధూలియా, జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. మోహన్‌బాబు పిటిషన్‌పై పోలీసులు స్పందనను తెలియజేయాలని ఆదేశిస్తూ విచారణను 4 వారాలు వాయిదావేసింది.
మోహన్‌బాబు తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. మోహన్‌బాబుతో గొడవపడిన ఆ యన కుమారుడు మీడయా సిబ్బందితో తండ్రి ఇంటికి వచ్చాడని తెలిపారు. ఉద్రిక్తతతో ఆవేశానికి గురైన మోహన్‌బాబు జర్నలిస్టుపైకి మైక్ విసిరాడని చెప్పారు. ఆయన తన తప్పును గ్రహించారని, బహిరంగంగా క్షమాపణ చెప్పేందుకు, అవసరమైతే బాధితుడికి పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. గాయపడిన జర్నలిస్టును పరామర్శించేందుకు మోహన్‌బాబు దవాఖానకు వెళ్లారని, మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదైందని తెలిపారు.