హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : బూటకపు ఎన్కౌంటర్లను తక్షణమే ఆపాలని రాష్ట్ర పౌర హక్కుల సంఘం డిమాం డ్ చేసింది. బీజాపూర్, కాంకేర్ అడవుల్లో 30 మందిని ఎన్కౌంటర్ చేసిన ఘటనపై తీవ్ర ఆగ్ర హం వ్యక్తంచేస్తూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఎన్కౌంటర్ పథకం ప్రకారమే జరిగిందని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నారాయణరావు ఆవేదన వ్యక్తంచేశారు.
జనవరి 1, 2024 నుంచి ‘ఆపరేషన్ కగార్’ లో భాగంగా సుమారు 487 మందిని బూటకపు ఎన్కౌంటర్ల తో హతమార్చారని, ఇవన్నీ ప్ర భుత్వ హత్యలేనని ఖండించారు. ఎన్కౌంటర్లు ఆపాలని 50 ఏం డ్లుగా పౌర హకుల సంఘాలు పోరాడుతున్నట్టు తెలిపారు.