న్యూఢిల్లీ: వ్యక్తిగత పనులపై విదేశాలకు వెళ్లే ఎంపీలు విదేశీ ఆతిథ్యం పొందడంపై రాజ్యసభ పలు ఆంక్షలు విధించింది. అలాంటి సందర్భంలో ఎంపీలు తప్పక కొన్ని మార్గదర్శకాలు పాటించాలని, ముందుగా కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని గురువారం రాజ్యసభ నోటిఫికేషన్ జారీ చేసింది.
ముఖ్యంగా నైతిక విలువల నిబంధనలు తప్పక పాటించాలని, వారి అధికార విధులను ప్రభావితం చేసేలా ఎలాంటి బహుమతులు స్వీకరించరాదని పేర్కొంది. టీఎంసీ ఎంపీ మొయిత్రాపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో రాజ్యసభ ఈ కొత్త నిబంధనావళిని నోటిఫై చేసింది.