Indian Railways | న్యూఢిల్లీ: రైల్వే శాఖలో 15 శాతం డ్రైవర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని రైల్వే బోర్డు తెలిపింది. జీవన్ ప్రకాశ్ శర్మ ఆర్టీఐ ద్వారా ఈ సమచారాన్ని రాబట్టారు. మొత్తం 1,27, 644 మంజూరైన డ్రైవర్లు, అసిస్టెంట్ డ్రైవర్ల పోస్టులలో 2024, మార్చి 1 నాటికి 18,766 పోస్టులు(14.7 శాతం) ఖాళీగా ఉన్నట్టు రైల్వే బోర్డు తెలిపింది.
మంజూరైన లోకో పైలట్ల (డ్రైవర్లు) పోస్టులు 70,093 కాగా,. అందు లో 14, 429 (సుమారు 20.5శాతం) ఖాళీ గా ఉండగా.. అసిస్టెంట్ లోకో పైలట్ల కోసం మొత్తం మంజూరైన 57,551 పోస్టుల్లో 4,337(సుమారు 7.5శాతం) పోస్టులు ఖాళీగా ఉన్నాయి.