న్యూఢిల్లీ: నిరుడు దేశంలోని శాసన సభలు సగటున 20 రోజులు మాత్రమే కార్యకలాపాలను నిర్వహించాయని పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. రాజ్యాంగంలోని అధికరణ 178 ప్రకారం శాసన సభ్యులు సాధ్యమైనంత త్వరగా సభాపతిని, ఉప సభాపతిని ఎన్నుకోవాలి. అయినప్పటికీ.. 2025 ఏప్రిల్ వరకు 8 శాసన సభలకు ఉప సభాపతి లేరని తెలిపింది.
జార్ఖండ్లో దాదాపు 20 ఏళ్లకు పైగా ఈ పదవి ఖాళీగానే ఉంది. యూపీ, ఛత్తీస్గఢ్, జమ్ముకశ్మీర్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరాఖండ్ శాసన సభల్లో ఉప సభాపతి పదవి భర్తీ కాలేదని చెప్పింది. 2019 జూన్ నుంచి లోక్ సభకు ఉప సభాపతి లేరు.