న్యూఢిల్లీ, అక్టోబర్ 14: వక్ఫ్(సవరణ) బిల్లును సమీక్షిస్తున్న పార్లమెంటరీ కమిటీ సమావేశాన్ని సోమవారం పలువురు విపక్ష ఎంపీలు బహిష్కరించారు. వక్ఫ్ భూముల స్కామ్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మరికొందరు నేతల ప్రమేయం ఉందని బీజేపీ నేత, కర్ణాట స్టేట్ మైనారిటీస్ కమిషన్, డెవలప్మెంట్ కార్పొరేషన్ల మాజీ చైర్మన్ అయిన అన్వర్ మనిప్పడి ఆరోపించడంతో విపక్ష ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయమై బీజేపీ, విపక్ష ఎంపీల మధ్య మాటల యుద్ధం జరిగింది.