Lok Sabha | 18వ లోక్‌సభ (Lok Sabha) సమావేశాలు వరుసగా రెండో రోజూ ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ఎంపీల చేత లోక్‌సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు (MPs swearing-in ceremony). తొలిరోజు మొత్తం 280 మంది ఎంపీలు లోక్‌సభ సభ్యులుగా ప్రమాణం చేశారు. తొలుత ప్రధాన మంత్రి, సభా నాయకుడు నరేంద్ర మోదీ, ఆ తర్వాత కేబినెట్ మంత్రులు వరుసగా ఎంపీలుగా ప్రమాణం చేశారు. ఇవాళ మిగిలిన సభ్యులచే ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. దేశ చరిత్రలోనే తొలిసారి లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఎప్పటిలాగే స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీయే చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో విపక్ష ఇండియా కూటమి కూడా స్పీకర్ పదవికి పోటీ పడుతోంది. కాంగ్రెస్ ఎంపీ సురేశ్‌ను ఇండియా కూటమి పార్టీల తరఫున బరిలోకి దింపింది. అదే సమయంలో ఎన్డీయే కూటమి పార్టీల అభ్యర్థిగా మరోసారి ఓం బిర్లాకే అవకాశం దక్కింది. వీరిద్దరూ ఇవాళ లోక్‌సభ స్పీకర్ పదవికి నామినేషన్ వేశారు.
Former Punjab CM and Congress MP Charanjit Singh Channi takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/i1EvC5O8Ea
— ANI (@ANI) June 25, 2024
BJP MP Aparajita Sarangi takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/G8HaiRh6Oz
— ANI (@ANI) June 25, 2024
BJP MP Sambit Patra takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/cmBmXN5pF6
— ANI (@ANI) June 25, 2024
Also Read..
Air India flight | లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు.. కేరళ వ్యక్తి అరెస్ట్
Nita Ambani | పదేళ్ల తర్వాత కాశీకి వెళ్లిన నీతా అంబానీ.. రోడ్‌సైడ్ షాప్‌లో చాట్ తిని
Lok Sabha Speaker | స్పీకర్ ఎన్నికలో ట్విస్ట్.. పోటీలో విపక్ష కూటమి.. తొలిసారి ఎన్నికలు