ముజఫర్‌నగర్: తనను పట్టించుకోని కన్నబిడ్డలకు సరైన బుద్ధి చెప్పాడో వృద్ధుడు. రూ.1.5 కోట్ల విలువ చేసే తన ఆస్తిని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి రాసిచ్చాడు. ముజఫర్‌నగర్‌కు చెందిన నాథూ సింగ్(85)కు టీచర్‌గా పనిచేస్తున్న కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు.
భార్య మరణానం తరం వారు పట్టించుకోకపోవటంతో వృద్ధాశ్రమంలో చేరాడు. తాజాగా, రూ.1.5 కోట్ల విలువచేసే తన ఇల్లు, భూమిని ప్రభుత్వానికి చెందేలా వీలునామా రాసాడు. అంత్యక్రియలకు తన పిల్లలను అనుమతించరాదని అందులో పేర్కొన్నాడు.