Congress | సూరత్: సూరత్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి నీలేశ్ కుంభని దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఆయనకు ప్రత్యామ్నాయంగా సురేశ్ పడ్సల దాఖలు చేసిన నామినేషన్ను కూడా చెల్లనిదిగా ప్రకటించారు.
కుంభని, పడ్సల సమర్పించిన నామినేషన్లపై ప్రతిపాదకుల సంతకాల్లో వ్యత్యాసాలు ఉన్నాయని గుర్తించామని, సంతకాలు తమవి కాదని ప్రతిపాదకులు అఫిడవిట్లలో తెలిపారని రిటర్నింగ్ అధికారి సౌరభ్ పర్ధి తెలిపారు.