న్యూఢిల్లీ: కేంద్రంలో మూడోసారి అధికారాన్ని చేపట్టిన ఎన్డీయే సర్కార్, ఎన్సీపీ (అజిత్‌పవార్) వర్గానికి షాకిచ్చింది. క్యాబినెట్ హోదా కలిగిన కేంద్రమంత్రి పదవి ఇవ్వాలన్న ఆ పార్టీ డిమాండ్‌ను తోసిపుచ్చింది. క్యాబినెట్లో బెర్త్ లభించటంపై మరికొద్ది రోజులు వేచి చూస్తామని అజిత్ పవార్ పేర్కొన్నారు.
స్వతంత్ర హోదాతో కూడిన సహాయ మంత్రి పదవి ఇస్తామని బీజేపీ నుంచి వచ్చిన అజిత్ వర్గం తిరస్కరించింది. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కేవలం ఒకే ఒక స్థానంలో గెలుపొందింది.