న్యూఢిల్లీ: స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై యూరోపియన్ యూనియన్ (ఈయూ), భారత్ మధ్య చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. రెండు వైపులా ప్రతినిధులు సాగిస్తున్న చర్చల్లో పురోగతి ఉందని, చరిత్రాత్మక ఒప్పందానికి ఈయూ-భారత్ అతి దగ్గరలో ఉన్నాయని యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్‌డెర్ లెయాన్ అన్నారు. దావోస్ ఆర్థిక సదస్సుకు హాజరైన ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ‘భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్నాం. దీనిని ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’గా కొంతమంది పేర్కొంటున్నారు. ఒప్పందంపై కసరత్తు ఇంకా కొనసాగుతున్నది. ఒప్పం దం కుదిరితే.. దాదాపు 200 కోట్ల మందితో కూడిన మార్కెట్‌ను ఈ ఒప్పందం సృష్టిస్తుంది’ ఆమె అని అన్నారు.