కోల్కతా: మెస్సీ వివాదం నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ క్రీడా శాఖకు మంత్రి అరూప్ బిశ్వాస్ రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆయన రాజీనామాను మంగళవారం ఆమోదించారు. అయితే అరూప్ విద్యుత్ శాఖ మంత్రిగా కొనసాగుతారని అధికార వర్గాలు వెల్లడించాయి. అర్జెంటీనా దిగ్గజ ఫుల్బాలర్ మెస్సీ కోల్కతా పర్యటన సందర్భంగా సాల్ట్ లేక్ స్టేడియంలో చోటుచేసుకున్న ఘటనలు, అభిమానుల విధ్వంసం నేతృత్వంలో సీఎం ఆ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించిన క్రమంలో ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ బిశ్వాస్ ఆ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు.