పట్నా: బీహార్ రాష్ట్రం పశ్చిమ చంపారన్ జిల్లాలో నరమాంసం రుచి మరిగిన పెద్దపులి పీడ విరగడైంది. పశ్చిమ చంపారన్ జిల్లాలోని బగహా పట్టణ పరిసరాల్లో ఓ పెద్దపులి తొమ్మిది మందిని చంపేసింది. గత మూడు రోజుల వ్యవధిలోనే నలుగురి ప్రాణాలు తీసింది. దాంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇండ్ల నుంచి బయటికి రావాలంటేనే హడలిపోయారు.
దాంతో సంబంధిత అటవీ అధికారులు పులిని హతమార్చడానికి ఆదేశాలిచ్చారు. జనావాసాల్లో సంచరిస్తూ మనుషుల ప్రాణాలు తీస్తుందన్న కారణంపై పులి హత్యకు ఆదేశాలిచ్చినట్లు అధికారులు తెలిపారు. అధికారుల ఆదేశాల మేరకు ఈ మధ్యాహ్నం ఆ పెద్దపులిని కాల్చి చంపారు.