న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌ను కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం మరోసారి కఠిన చర్యలు చేపట్టింది. బంగ్లాదేశ్ నుంచి రెడీమేడ్ దుస్తులు కేవలం కోల్‌కతా, నవ సేవ నౌకాశ్రయాల గుండా మాత్రమే భారత్‌లోకి అనుమతిస్తామని తెలిపింది. రెడీమేడ్ గార్మెంట్స్, ప్లాస్టిక్స్, కలప ఫర్నిచర్, కార్బొనేటెడ్ డ్రింక్స్, ప్రాసెస్డ్ ఫుడ్ ఐటమ్స్, వంటి వాటిని మేఘాలయ, అస్సాం, త్రిపుర, మిజోరం, ఫుల్బరి, కస్టమ్స్ స్టేషన్స్ గుండా రోడ్డు మార్గంలో భారత్‌లోకి ప్రవేశించడంపై నిషేధం విధించింది.
దాదాపు ఐదు వారాల క్రితం ట్రాన్స్షిప్మెంట్ అవగాహనను భారత్ రద్దు చేసింది.. దీనివల్ల ఇతర దేశాలకు భారత్ గుండా రకరకాల ఉత్పత్తులను ఎగుమతి చేసే అవకాశాన్ని బంగ్లాదేశ్ కోల్పోయింది.