న్యూఢిల్లీ : తమిళనాడులోని ధనుష్కోటి వద్ద ఉన్న శ్రీరామ సేతును దర్శించుకుంటే మోక్షం సిద్ధిస్తుందని, దీనిని దర్శించుకునే అవకాశం హిందువులకు కల్పించాలని కోరుతూ హిందూ పర్సనల్ లా బోర్డ్ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది.
రామేశ్వరం వద్ద సముద్రంపై శ్రీరాముని ఆదేశాల మేరకు నిర్మితమైన ఈ వారథికి సమీపంలో గోడను నిర్మించాలని ఈ బోర్డు చైర్మన్ అశోక్ పాండే కోరారు. రామ సేతును దర్శించుకుంటే ముక్తి లభిస్తుందని హిందూ గ్రంథాలు చెప్తున్నాయని తెలిపారు. దీనిని జాతీయ కట్టడంగా ప్రకటించాలని కోరారు.