న్యూఢిల్లీ: ఎమ్మెల్యేకు వ్యక్తిగత భద్రతా సిబ్బందిగా డ్యూటీ చేయాలని ఓ కానిస్టేబుల్‌ను పంపితే, అతడు నాలుగేండ్లుగా విధులకు హాజరుకాకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. వేతనం పొందుతూ వివిధ చోట్ల హాలిడే ట్రిప్లతో ఎంజాయ్ చేస్తున్నాడు. రాజస్థాన్‌లోని కోటా సిటీ పోలీస్ లైన్స్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఓ ఎమ్మెల్యేకు గన్‌మెన్‌గా వెళ్లిన కానిస్టేబుల్ జితేంద్ర సింగ్ 2019 నుంచి డ్యూటీ చేయటం లేదన్న సంగతి కోటా సిటీ పోలీస్ ఉన్నతాధికారులకు తెలిసాక, సదరు కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. నాలుగేండ్లుగా జిల్లా పోలీస్ కేంద్రంలో రిపోర్ట్ కూడా చేయకపోవటంతో, జితేంద్ర సింగ్‌కు జిల్లా పోలీస్ కేంద్రం నుంచి ఫోన్ చేయాల్సి వచ్చింది. అతడు డ్యూటీకి డుమ్మాకొట్టి లడఖ్‌లో హాలిడే ట్రిప్‌లో ఉన్నాడన్నది బయటకొచ్చింది. ఈ ఘటనపై కోటా సిటీ అడిషనల్ ఎస్పీ విచారణకు ఆదేశించారు.