Home
National
The Gslv F14 Rocket Launched By The Indian Space Research Organization Isro From Sriharikota On Saturday Crashed Into Ningi Spewing Flames
నింగిలోకి నాటీ బాయ్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శనివారం శ్రీహరికోట నుంచి ప్రయోగించిన జీఎస్ఎల్వీ-ఎఫ్14 రాకెట్ నిప్పులు వెదజల్లుతూ నింగిలోకి దూసుకెళ్లింది. మూడో తరం వాతావరణ శాటిలైట్ ‘ఇన్శాట్-3డీఎస్'ను భూకక్ష్యలో ప్రవేశపెట్టేందుకు ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టింది.
- జీఎస్ఎల్వీ – ఎఫ్14 సక్సెస్ భూకక్ష్యలోకి ఇన్శాట్-3 డీఎస్
- వాతావరణ అంచనా వ్యవస్థ మెరుగునకు ఉపగ్రహం దోహదం
శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శనివారం శ్రీహరికోట నుంచి ప్రయోగించిన జీఎస్ఎల్వీ-ఎఫ్14 రాకెట్ నిప్పులు వెదజల్లుతూ నింగిలోకి దూసుకెళ్లింది. మూడో తరం వాతావరణ శాటిలైట్ ‘ఇన్శాట్-3డీఎస్’ను భూకక్ష్యలో ప్రవేశపెట్టేందుకు ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టింది. ‘నాటీ బాయ్’ అని శాస్త్రవేత్తలు ముద్దుగా పిలిచే 2,274 కిలోల బరువు గల ఇన్శాట్-3డీఎస్ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ రాకెట్ నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టనున్నది.
వాతావరణ పరిశీలనను మెరుగుపరచడానికి, భూమి, సముద్ర ఉపరితలాల్ని పర్యవేక్షించడానికి ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. తద్వారా వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరిక వ్యవస్థలు మరింత మెరుగుపడటానికి ఆస్కారముంది. ఈ శాటిలైట్ సేవల్ని భూ విజ్ఞాన, భారత వాతావరణ విభాగాలు వినియోగించుకుంటాయి. ఈ ఏడాది ఇస్రో చేపట్టిన రెండో రాకెట్ ప్రయోగమిది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

