ఓటమి భయంతోనే తమ స్థానాలు వీడుతున్నారు… స్వామి ప్రసాద్ మౌర్య ఓటమి ఖాయం: అనురాగ్ ఠాకూర్

న్యూఢిల్లీ: కొందరు నేతలు ఓటమి భయంతోనే తమ నియోజకవర్గ స్థానాలను వీడి మరో చోట పోటీ చేస్తున్నారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పారిపోయారని ఎద్దేవా చేశారు. అలాగే ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తన సీటును విడిచిపెట్టారని విమర్శించారు. తాజాగా స్వామి ప్రసాద్ మౌర్య కూడా తన స్థానం నుంచి పారిపోతున్నారని ఎద్దేవా చేశారు.
మరోవైపు బీజేపీకి, మంత్రి పదవికి రాజీనామా చేసి ఇటీవల సమాజ్‌వాదీ పార్టీలో చేరిన స్వామి ప్రసాద్ మౌర్యపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పలు విమర్శుల చేశారు. ఆయన ప్రతి ఐదేండ్లకు కొత్త స్వామి (పార్టీ)ని ఎన్నుకుంటారని ఆరోపించారు. అయితే ఇప్పుడు చాలా కష్టంలో ఉన్న ఆయన తన సొంత స్థానం నుండి పోటీ చేయడానికి కూడా సిద్ధంగా లేరని ఎద్దేవా చేశారు. స్వామి ప్రసాద్ మౌర్య, పడ్రౌనా స్థానం నుండి పారిపోవాల్సిన అవసరం ఏమిటి? అని ప్రశ్నించారు. ఆయన ఓటమి భయంతో ఉన్నారని, దీంతో ఆయన ఓడిపోవడం ఖాయమన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

