ఉత్సవంలా విడాకులు.. ఊరేగింపుగా ఇంటికి.. కుమార్తెను తీసుకొచ్చిన మాజీ జడ్జి
సంప్రదాయ సామాజిక వైఖరికి భిన్నంగా యూపీలోని మీరట్‌కు చెందిన ఓ మాజీ జడ్జి కుటుంబం విడాకులను మౌనంతో కాకుండా వేడుకలా జరుపుకొంది.
మీరట్: సంప్రదాయ సామాజిక వైఖరికి భిన్నంగా యూపీలోని మీరట్‌కు చెందిన ఓ మాజీ జడ్జి కుటుంబం విడాకులను మౌనంతో కాకుండా వేడుకలా జరుపుకొంది. బాధితురా లి న్యాయవాదుల కథనం ప్రకారం.. ప్రణీత వశిష్టకు ఓ ఆర్మీ మేజర్‌తో 2018లో పెండ్లి జరిగింది. కొన్ని రోజులకే అత్తింటి వారు ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించ డం మొదలుపెట్టారు. ప్రణీతకు ఒక కొడుకు జన్మించిన తర్వాత కూడా వేధింపులు ఆగలేదు. దీంతో ఆమె విడాకుల కోసం కుటుంబ న్యాయస్థానంలో దరఖాస్తు చేసింది. ఈ నెల 4న విడాకులు మంజూరయ్యాయి.
దీంతో కోర్టు నిర్ణయాన్ని ఆమె కుటుంబం ‘కొత్త ప్రారంభానికి’ సూచికగా భావించి దాన్ని వేడుకగా జరపాలనుకున్నది. ప్రణీత కోర్టు నుంచి బయటకు రాగానే ఆమెను మేళతాళాలతో ఊరేగింపుగా ఇంటి వరకు తీసుకెళ్లింది. ‘వివాహ జీవితంలో సంతోషంగా లేని నా కూతురిని ఆ వాతావరణం నుంచి బయటకు తీసుకురావడం నా బాధ్యత. నేను అదే చేశాను’ అని ప్రణీత తండ్రి శర్మ తెలిపారు. తన కు టుంబ సాయంతో తాను తిరిగి నిలదొక్కుకోగలిగానని బాధితురాలు పేర్కొన్నారు. ‘పెండ్లి చేసుకోవాలనుకొనే ముందు మిమ్మల్ని మీరు చైతన్యపరుచుకోండి, స్వతంత్రంగా ఉండండి‘ అని ప్రణీత మహిళలకు సందేశమిచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

