న్యూఢిల్లీ, నవంబర్ 9: పాత కాగితాలు అమ్మి కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు సంపాదించింది. ఈ ఏడాది అక్టోబర్లో నెల రోజులపాటు శుభ్రతా మాసోత్సవాన్ని నిర్వహించిన కేంద్ర ప్రభుత్వం కాగితాలతో నిండిపోయిన పాత ఫైళ్లను విక్రయించడం ద్వారా అక్షరాలా రూ.800 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. వివిధ మంత్రిత్వ శాఖలు, విదేశాలలోని రాయబారి కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాయాలతోసహా 11.5 లక్షల ప్రభుత్వ స్థలాలలో పరిశుభ్రతా కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన జరిగింది.
232 లక్షల చదరపు అడుగుల ప్రదేశాన్ని శుభ్రం చేయడం ద్వారా దాదాపు 30 లక్షల పనికిరాని ఫైళ్లను వదిలించుకుంది.