న్యూఢిల్లీ, డిసెంబర్ 31: పాకిస్థాన్ అనుకూల వేర్పాటువాద సంస్థ తెహ్రీక్-ఏ-హురియత్ (టీఈహెచ్)పై ఐదేళ్ల పాటు నిషేధం విధిస్తున్నట్టు కేంద్రం ఆదివారం ప్రకటించింది. దివంగత వేర్పాటువాది సయ్యద్ అలీ షా గిలానీ స్థాపించిన ఈ సంస్థ జమ్ము-కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలను చేపట్టడంతో పాటు భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తున్నందున రానున్న ఐదేండ్ల పాటు దీనిపై ఉపా చట్టం కింద నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు.
తెహ్రీక్-ఏ-హురియత్‌ను 2004లో గిలానీ ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు చెందిన పలువురిపై ఎన్ఐఏ కేసులు నమోదు చేసింది. 2021లో గిలానీ మరణించారు.