న్యూఢిల్లీ : దాదాపు 300 రకాల సైన్స్ అవార్డులను రద్దుచేస్తూ, వాటి స్థానంలో సరికొత్తగా ‘రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాల్ని’ ఏర్పాటుచేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో విశేష కృషి చేసిన సైంటిస్టులకు అవార్డులు ప్రకటిస్తామని, ఏటా ఆగస్టు 23న (జాతీయ అంతరిక్ష దినోత్సవం) పురస్కారాల్ని అందజేస్తామని గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.
వీటిని సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్‌లో అత్యున్నత పురస్కారాలుగా పేర్కొన్నది. విజ్ఞాన్ రత్న, విజ్ఞాన్‌శ్రీ, విజ్ఞాన్ యువ-శాంతి స్వరూప్ భట్నాగర్, విజ్ఞాన్ టీం.. నాలుగు కేటగిరీల్లో ఈ పురస్కారాల్ని అందజేయనున్నట్టు కేంద్రం తెలిపింది.