ప్రమాదవశాత్తూ చెరువులో పడి మరణించిన ఏడాదిన్నర కొడుకు మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లో చుట్టిన ఓ తండ్రి.. బైక్పై 70 కిలోమీటర్ల మేర ప్రయాణించి జిల్లా దవాఖానకు తరలించాడు. అంబులెన్స్ సర్వీసు లేదని చెప్పడంతోనే ఇష్టంలేకపోయినా ఇలా చేశానంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. కాంగ్రెస్పాలిత ఛత్తీస్గఢ్లో ఇది జరిగింది.